ఓ సామాన్యుని కథ 3
మా నానమ్మ శారదాబాయి మా తాత గారికి చిన్న భార్య కావడంతో ఎంతో బాగా చూసుకునే వారట. మానానమ్మకి ఏడు వారాల నగలు చేయించారని ఎంతో గొప్పగా చెప్పుకునేది మా నానమ్మ. ఇంకో విశేషమేమిటంటే... అప్పట్లో భర్త మొహం చూసేందుకు ఆడాళ్లు ఎంతో సిగ్గుపడేవారట. మా నానమ్మ వాళ్లాయన మొహాన్ని ఖచ్చితంగా చూసిన గుర్తేలేదని అప్పుడప్పుడూ చెబుతుండేది. వాళ్ల అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ముగ్గురు సంతానం కలిగారు. వాళ్లలో ఇద్దరు అమ్మాయిలు. ఒక అబ్బాయి. పెద్దమ్మాయి నర్సుబాయి, చిన్నమ్మాయి సూర్యాబాయి. అందరికంటే చిన్నవాడు మా నాన్న దత్తాద్రి.. వీళ్లు ఎదిగే సమయానికి మా తాయ్య కాలం చేయడం ఆతరువాత... దర్జగా బతికిన మా తాతయ్య కుటుంబం ఆస్తి పాస్తులు కోల్పోయి ఇంచుమించు రోడ్డున పడ్డారు. బేతిగల్ నుంచి పొట్టచేతబట్టుకుని ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు. అలా మా నానమ్మ ఆదిలాబాద్ జిల్లా మందమర్రికి వచ్చింది. అప్పటికే వాళ్లక్కయ్య వాళ్ల అబ్బాయి లక్ష్మీనారాయణ ప్రైవేటులో డ్రైవర్‌గా పనిచేస్తూ... సింగరేణిలో ఉద్యోగం సంపాదించి స్థిరపడ్డాడు. వాళ్ల సహకారంతో అక్కడ మా నానమ్మ పక్కనే ఓ చిన్న గుడిసె వేసుకుని మానాన్నను తీసుకుని ఎన్నో కష్టాలు పడింది. మిగతా ఇద్దరు అమ్మాయిల పెళ్లిళ్లు మా తాతగారున్నప్పుడే అయ్యాయి. దీంతో వారు ఈ కష్టాల కడలికి అవతలి తీరం వైపు ఉన్నారు. పాపం మానామ్మే ఒకప్పుడు వందల మందికి తిండి పెట్టిన చేయి ఒకరిమీద ఆధార పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మా నానమ్మ మందమర్రికి వచ్చే సమయానికి మా నాన్నకు సుమారు ఓ పది పన్నెండేళ్లుంటాయని మానానమ్మ చెప్పేది. అలా నాలుగైదేళ్లు గడిచాక మానాన్న కూడా పెదనాన్న సహకారంతో ప్రైవేటు లో లారీ క్లీనర్‌గా పనిలో చేరారు. అప్పటి నుంచి మా నాన్న జీవిన పోరాటం కోనసాగుతూనే ఉంది.